నెల్లూరులో ఆ అభ్యర్థికి ఒక్క ఓటూ లేదాయె!

ABN , First Publish Date - 2021-02-20T19:48:14+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో కొన్ని విచిత్రాలు చోటుచేసుకోన్నాయి.

నెల్లూరులో ఆ అభ్యర్థికి ఒక్క ఓటూ లేదాయె!

నెల్లూరు : 3వ విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని విచిత్రాలు చోటుచేసుకోన్నాయి.  డక్కిలి మండలం దేవులపల్లి పంచాయతీ ముగ్గురు బరిలో నిలిచారు. వీరిలో కలవల శ్రీనివాసులుకు 402 ఓట్లు, సోకా పాపయ్యకు 336 ఓట్లు వచ్చాయి. ఇక మూడో అభ్యర్థి బట్టేపాటి పెంచలయ్యకు ఒక్క ఓటు కూడా పోల్‌ కాలేదు. చివరికి నోటాకు వచ్చిన 2 ఓట్లతో సమానంగా ఓట్లు రాకపోవడంతో అభ్యర్థి కూడా తన గుర్తుకు తాను ఓటు వేసుకోలేక పోయారు.


ఇది ఇటు అధికారుల్లోనూ అటు గ్రామస్థుల్లోనూ చర్చనీయాంసమైంది. ఇక పలుగోడు పంచాయతీలో అభ్యర్థి తిరుమలశేట్టి రత్నయ్య తన ప్రత్యర్థి సాచల నాగరాజుపై 11 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ చెల్లని ఓట్లు 28 వచ్చాయి.  బ్యాలెట్‌పై ఆదార్‌, ఫోన్‌ నెంబర్లు నమోదుచేయడంతో అవి చెల్లనివిగా పరిగణించారు. అంటే మెజారిటీ ఓట్లు కన్నా చెల్లని ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి ఏ సర్పంచ్‌ అభ్యర్థివోనన్న చర్చ నడుస్తోంది. ఇక మండల స్థాయిలో నోటాకు 143 ఓట్లు, చెల్లని ఓట్లు 426 వచ్చినట్లు అధికారులు తెలిపారు. - డక్కిలి, నెల్లూరు జిల్లా.

Read more