Abn logo
Aug 15 2020 @ 00:23AM

భయపెట్టే ‘సిరంగి’

కొత్త హీరో శ్రీకాంత్‌, సందీప్తి జంటగా నటించే ‘సిరంగి’ చిత్రం షూటింగ్‌ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. అప్పాజీ కొండా దర్శకత్వంలో పత్రి మధ్వాచార్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. హారర్‌ కామెడీ చిత్రం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. దర్శకుడు అప్పాజీ మాట్లాడుతూ ‘కొత్తవాళ్లతో ఓ ప్రయోగం చేస్తున్నాం. శనివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, సెప్టెంబర్‌ 25కు పూర్తి చేస్తాం. షూటింగ్‌ మొత్తం హైదరాబాద్‌లో ఉంటుంది. మెదక్‌ ఫారె్‌స్టలో ఓ ఐదు రోజులు వర్క్‌ చేస్తాం. సూపర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement