Abn logo
Sep 25 2021 @ 23:06PM

చందకపేటలో సిరిమాను

సిరిమాను చెట్టుకు పూజలు చేసిన పైడితల్లి ఆలయ పూజారి, చందకపేట గ్రామస్థులు

చెట్టును గుర్తించిన పూజారి

వచ్చేనెల 2న తరలింపు 

డెంకాడ, సెప్టెంబరు 25: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో కీలక ఘట్టమైన సిరిమాను చెట్టు గుర్తింపు ప్రక్రియ శనివారం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. డెంకాడ పంచాయతీ పరిధిలోని చందకపేటలోని చందక రామలక్ష్మి, చందక పద్మావతిలకు చెందిన పొలాల్లో ఉన్న చింత చెట్టును గుర్తించారు. ఆనవాయితీ ప్రకారం కలలో అమ్మవారు కనిపించి ఈ చెట్టును సిరిమానుగా మలచాలని చెప్పారని పూజారి బంటుపల్లి వెంకటరావు తెలిపారు. ఈవో బీవీఎస్‌ కిషోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం గ్రామానికి వెళ్లి చెట్టును గుర్తించి పూజలు చేశారు. పసుపు, కుంకుమలు సమర్పించారు. ఈ విషయం తెలిసి డెంకాడ, చందకపేట పరిసర ప్రాంత ప్రజలంతా అక్కడకు చేరుకుని అమ్మవారి చెట్టుకు పూజలు చేశారు. కార్యక్రమంలో డెంకాడ పీఏసీఎస్‌ అధ్యక్షులు రొంగలి కనక సింహాచలం, వైస్‌ సర్పంచ పాండ్రంకి ఆదినారాయణ, పైడిమాంబ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.