Abn logo
Sep 27 2021 @ 23:48PM

జీవో రద్దు చేయకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం

శిరిపురపు శ్రీధర్‌

జాతికి ద్రోహంచేస్తున్న వైసీపీ బ్రాహ్మణ నేతలు

బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌

గుంటూరు, సెప్టెంబరు 27: బ్రాహ్మణ కార్పొరేషనను బీసీ కార్పొరేషనలో విలీనంచేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 103ను తక్షణం రద్దుచేయకపోతే సీఎం జగన ఇంటిని ముట్టడిస్తామని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు వెంకట శ్రీధర్‌ హెచ్చరించారు. సోమవారం బ్రాడీపేటలోని చైతన్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీలోని బ్రాహ్మణ నాయకులు తమ స్వార్ధం కోసం బ్రాహ్మణ జాతికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి బ్రాహ్మణ కార్పొరేషనను బీసీ కార్పొరేషనలో కలపడం వల్ల బ్రాహ్మణులకు వచ్చే నష్టమేమీ ఉండదని మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఒక్కో మంత్రి ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలు పలు అనుమానాలకు, కుట్ర కోణానికి తావిస్తున్నాయన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన చైర్మనగా నియమితులైన సీతారామరాజు, సుధాకర్‌ ఇంతవరకు దీనిపై స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో 310 కోట్ల బడ్జెట్‌ కేటాయించి మార్గదర్శకంగా బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేశారన్నారు.