తిరుపతి మేయర్‌గా శిరీష

ABN , First Publish Date - 2021-03-18T02:41:14+05:30 IST

తిరుపతి కార్పొరేషన్ మేయర్‌గా శిరీషను వైసీపీ నేతలు ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా ముద్ర నారాయణను వైసీపీ నిర్ణయించింది.

తిరుపతి మేయర్‌గా శిరీష

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్ మేయర్‌గా శిరీషను వైసీపీ నేతలు ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా ముద్ర నారాయణను వైసీపీ నిర్ణయించింది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు డిప్యూటీ మేయర్‌గా ప్రచారంలో భూమన అభినయరెడ్డి ఉన్నారు. మరో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పోస్టులకు ఆర్డినెన్స్‌ తెస్తామని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో మరో డిప్యూటీ మేయర్ పదవి ఆర్డినెన్స్‌పై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సంతకం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల పెంపు ఆర్డినెన్స్‌‌ను అసెంబ్లీలో  వైసీపీ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత భూమన అభినయరెడ్డిని డిప్యూటీ మేయర్‌గా తిరుపతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టనున్నారు. గురువారం జరగనున్న ప్రమాణస్వీకారం అనంతరం మేయర్‌గా శిరీష, డిప్యూటీ మేయర్‌గా నారాయణను ఏకగ్రీవంగా వైసీపీ కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు.


Updated Date - 2021-03-18T02:41:14+05:30 IST