Advertisement

కాసేపట్లో సిరివెన్నెల అంత్యక్రియలు

టాలీవుడ్ లెజెండరీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి .. భౌతిక దేహాన్ని  మహాప్రస్థానానికి తరలించారు. ఆయన్ని కడసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.  టాలీవుడ్ సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మహాప్రస్థానంలో దహన క్రియలకు మందు జరిపే కర్మ కాండల్ని వారి కుమారులు యోగేశ్వర శర్మ, రాజాల చేత జరిపిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే సిరివెన్నెల అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు సీతారామ శాస్త్రి న్యుమోనియాతో కన్నుమూశారు. ఆయన మరణం నిజంగా టాలీవుడ్ సినీ సాహిత్యానికి తీరని లోటు. 

Advertisement