Advertisement

సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్: వెంకటేశ్

సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్ అని టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ అన్నారు. నేడు ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివనికి సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి కంటతడి పెట్టిన టాలీవుడ్ ప్రముఖులు.. సిరివెన్నెలతో ఉన్న ప్రత్యేక అనుబంధం ఎలాంటిదో గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ మాట్లాడుతూ.."తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్, ఆయన చాలా మంచి వ్యక్తి. 'బొబ్బిలి రాజా', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాల నుంచి రీసెంట్‌గా వచ్చిన 'నారప్ప' వరకు కలిసి పని చేశాము. ఆయనతో చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. ఈరోజు ఆయన లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సిరివెన్నెల ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను"..అని అన్నారు.

Advertisement