Abn logo
Jun 4 2020 @ 14:06PM

సోషల్ మీడియాలోకి సిరివెన్నెల!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పేందుకు వేదికగా మారింది. అలాగే సామాన్యులకు, సెలబ్రిటీలు మధ్య వారధిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారు. ప్రముఖ కవి, దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ట్విటర్‌లోకి ప్రవేశించారు.


`Sirivennela Official @sirivennela1955` ఐడీతో ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. `సోషల్ మీడియాలో యాక్టివ్ అవుదామనే కోరిక కలిగింది. నా అభిప్రాయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా సాహితీ వ్యాసాంగాల గురించి మీ అభిప్రాయలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే ట్విటర్‌లోకి ప్రవేశిస్తున్నాను. Sirivennela [email protected] ఐడీతో అకౌంట్ ప్రారంభించాన`ని సీతారామశాస్త్రి పేర్కొన్నారు. పలువురు సినీ ప్రముఖులు ట్విటర్‌లోకి సిరివెన్నెలకు ఆహ్వానం పలికారు. 



Advertisement
Advertisement
Advertisement