Advertisement

సిరివెన్నెల పాటలు రాసిన చివరి చిత్రమిదే

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఇకలేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తన రాతలతోనే సినిమాకి జీవం పోసిన సిరా ఇంకిపోవడం.. యావత్ తెలుగు సినిమా పరిశ్రమని విషాదంలో ముంచేసింది. ఆయన కలం నుండి ఇక పాట రాదంటే.. ప్రేక్షక హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. కాగా, ఆయన చివరిగా పాటలు రాసింది ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన రెండు పాటలను రాసినట్లుగా ఆ చిత్ర మేకర్స్ తెలిపారు.


Advertisement