Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లయిన నాలుగో రోజే నవవధువు మిస్సింగ్.. స్కూల్ బాత్రూంలో ఆమె శవం.. దానికి కాస్త దూరంలోనే..

పెళ్లి చేసుకుని అత్తింట్లో దీపం వెలిగించాల్సిన నవ వధువు స్కూల్ బాత్రూంలో శవంగా మారింది.. దానికి కొద్ది దూరంలోనే ఆమెకు వరసకు అన్నయ్య అయ్యే వ్యక్తి మృతదేహం ఉంది.. దీంతో ఆరా తీస్తే వారిద్దరూ ప్రేమికులని తేలింది.. నాలుగు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న వధువును అతనే గొంతు కోసి చంపినట్టు స్పష్టమైంది.. రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ఉదాని గ్రామానికి చెందిన ఖిమారామ్ తన కజిన్ సిస్టర్‌ను గాఢంగా ప్రేమించాడు. నాలుగు రోజుల క్రితమే ఆమెకు వేరే యువకుడితో పెళ్లి జరిగింది. దీంతో గత గురువారం ఆమెను ఊర్లోని పాఠశాలకు రమ్మని పిలిచి అక్కడ గొంతు కోసం చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పాఠశాల బాత్రూమ్‌లో పడేశాడు. కొద్ది దూరం వెళ్లి తను విషం తాగేశాడు. స్థానికులు గుర్తించేటప్పటికే ఇద్దరూ చనిపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement