సీతారాముల వార్షిక కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2021-06-24T04:55:16+05:30 IST

వేంకటేశ్వరస్వామి దత్తత దేవాలయమై కామవరపుకోట మండలం తూర్పు యడవల్లిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో వార్షిక కల్యాణోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

సీతారాముల వార్షిక కల్యాణోత్సవం
సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకులు

ద్వారకాతిరుమల, జూన్‌ 23: వేంకటేశ్వరస్వామి దత్తత దేవాలయమై కామవరపుకోట మండలం తూర్పు యడవల్లిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో వార్షిక కల్యాణోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వర కు కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ద్వారకా తిరుమల  వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవో జీవీ సుబ్బారెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, హోమాది ద్రవ్యాలు అందించారు. ఆలయంలో విష్వక్షేన ఆరాధన, ఆంకురార్పణ కార్యక్రమాలను అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:55:16+05:30 IST