రామాయణం నేపథ్యంలో బాలీవుడ్లో మరో భారీ చిత్రం రాబోతోంది. రామాయణంలో సీతకు సంబంధించిన ఘట్టాలతో ‘సీత - ద ఇన్కార్నేషన్’ తెరకెకక్కుతోంది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలౌకికా దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మగధీర’, ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలకు కథను అందించిన కె.విజయేంద్రప్రసాద్, అలౌకికా దేశాయ్‌తో కలసి కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్ గురువారం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ సాంకేతికతో భారీఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర తారాగణం, ఇతర వివరాలను ప్రకటించాల్సి ఉంది.