Aug 2 2021 @ 05:04AM

తెలుగు తెరకు సీతగా

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్‌, ప్రియాంకా దత్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నారు. ఆ రాముడికి జోడీగా, సీత పాత్రలో హిందీ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. ఆదివారం సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ విడుదల చేశారు. ‘బాట్లా హౌస్‌’, ‘సూపర్‌ 30’, ‘తూఫాన్‌’ తదితర హిందీ చిత్రాల్లో నటించిన మృణాల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇటీవల  సినిమా కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలో తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీత దర్శకుడు.