Abn logo
Jun 3 2021 @ 12:44PM

డీసీపీ రక్షిత దురుసుగా వ్యవహరించారంటూ సీతక్క ఆవేదన

వరంగల్: ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదనకు గురయ్యారు. కరోనాతో బాధపడుతున్న తన తల్లికి బ్లడ్‌ ఇచ్చేందుకు వెళ్తున్న.. తన బంధువుల పట్ల డీసీపీ రక్షిత దురుసుగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెహికల్‌ పర్మిషన్ ఉన్నా పోలీసులు ఆరగంట సేపు నిలిపివేశారని సీతక్క వాపోయారు. వీడియోకాల్‌లో విషయం వివరించేందుకు ప్రయత్నించినా డీసీపీ వినలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఆమె ఆవేదన చెందారు. ఎమ్మెల్యే సీతక్క వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement
Advertisement