Abn logo
Oct 23 2021 @ 23:31PM

నూతన సబ్‌ స్టేషన్ల స్థల పరిశీలన

కార్యాలయాన్ని పరిశీలిస్తున్న హరినాథరావు

బద్వేలు, అక్టోబ రు 23: నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, పోరుమామిళ్ల సబ్‌ డి విజన్ల పరిధిలో ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థ లాలను శనివా రం బద్వేలు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరినాథరావు పరిశీలించారు. బద్వేలు మండలం కొత్తచెరు వు, అనంతరాజపురం, పోరుమామిళ్ల మండలం సిద్దవరం, ఈదుళ్లప ల్లె, కాశినాయన మండలం బాలాయపల్లె, కలసపాడు మండలం బ్రాహ్మణపల్లెలకు సబ్‌స్టేషన్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.

24,25 వార్డుల్లో నివా స గృహాలపై ఉన్న 33 కేవీ లైన్‌పరిశీలించి ఎత్తుగల స్థంభాలను ఏర్పాటు చేయాలని,  చెన్నంపల్లె ఎస్సీ కాలనీలో ఉ పయోగంలోలేని 11కేవి లైన్‌పై ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కడప పర్యవేక్షణ ఇంజనీర్‌ శోభ, మైదుకూరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రామిరెడ్డి, తదితర విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు.