కరోనా బాధితుల వివరాలు తెలుపుతాం

ABN , First Publish Date - 2021-05-05T06:31:49+05:30 IST

జీజీహెచ్‌ విజయవాడలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య వివరాలు కుటుంబ సభ్యులకు తెలియజే సేందుకు ఏర్పాట్లు చేశామని జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారి ఎల్‌. శివ శంకర్‌ తెలిపారు.

కరోనా బాధితుల వివరాలు తెలుపుతాం

జేసీ శివ శంకర్‌

పాయకాపురం, మే 4 : జీజీహెచ్‌ విజయవాడలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య వివరాలు కుటుంబ సభ్యులకు తెలియజే సేందుకు ఏర్పాట్లు చేశామని జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారి ఎల్‌. శివ శంకర్‌ తెలిపారు. నగరంలోని జీజీహెచ్‌లో మంగళ వారం కొవిడ్‌ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, మందులు ఇతర మౌలిక సదుపాయాలపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కె.శివ శంకర్‌తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే కొవిడ్‌ బాధితులకు ఉత్తమ వైద్య సేవలను అందించటంతో వైద్యుల కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొవిడ్‌ బాధితులకు ఆసుపత్రుల ద్వారా హోం ఐసోలేషన్‌ ద్వారా వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. విజయవాడలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతున్న వారి ఆరోగ్య వివరాలను వారి కుటుంబ సభ్యులకు 24 గంటలూ తెలియజేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. జీజీహెచ్‌ ఆసుపత్రిలోని ల్యాండ్‌ నెంబరు 0866-2953132కు ఫోన్‌ చేయవచ్చన్నారు. సీహెచ్‌. జ్యోతి సెల్‌ నెంబరు 9640600726 ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరీక్షణరావు సెల్‌ నెంబరు 7799112379, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే పిన్నమనేని సిద్ధార్థ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలసుకునేందుకు ప్రత్యేక సెల్‌ కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 


Updated Date - 2021-05-05T06:31:49+05:30 IST