ఆరు ACB కార్యాలయాల ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-23T14:49:12+05:30 IST

రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ఆరు అవినీతి నిరోధక నిఘా విభాగం కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. కల్లకురిచ్చి, తెన్‌కాశి, చెంగల్పట్టు, తిరుపత్తూరు,

ఆరు ACB కార్యాలయాల ప్రారంభం

చెన్నై: రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ఆరు అవినీతి నిరోధక నిఘా విభాగం కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. కల్లకురిచ్చి, తెన్‌కాశి, చెంగల్పట్టు, తిరుపత్తూరు, రాణిపేట, మైలాడుదురై నగరాలలో రూ.2.93 కోట్లతో నిర్మించిన ఆ కార్యాలయ భవనాలను సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌, ప్రభుత్వ పాలన సంస్కరణల విభాగం ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, అవినీతి నిరోధక నిఘా విభాగం డైరెక్టర్‌ పి. కందసామి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదే విధంగా సచివాలయం నుంచే రాష్ట్ర నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శివగంగ జిల్లా కళనివాసల్‌ వద్ద రూ.130.20 కోట్లతో నిర్మించే 900 రెసిడెన్షియల్‌ ప్లాట్లతో కూడిన భవన సముదాయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. తిరుప్పూరు, కరూరు, కోయంబత్తూరు, నామక్కల్‌, తిరుచ్చి, ఈరోడ్‌, తంజావూరు జిల్లాల్లో సమగ్ర మంచినీటి పథకాలకు ప్రారంభోత్సవం, కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు.

Updated Date - 2022-01-23T14:49:12+05:30 IST