ఆండ్రాయిడ్‌లో ఆరు ఫీచర్లు

ABN , First Publish Date - 2021-02-27T09:27:47+05:30 IST

దాదాపుగా అన్ని మేజర్‌ యాప్‌ల్లోనూ డార్క్‌మోడ్‌ ఉంది. ఇప్పుడు అది గూగుల్‌ మ్యాప్‌లకూ వర్తించనుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి థీమ్‌ని ట్యాప్‌ చేయాలి. ‘ఆల్వేస్‌ ఇన్‌ డార్క్‌ థీమ్‌’ని డార్క్‌ మోడ్‌కి టర్న్‌ చేసుకోవాలి.

ఆండ్రాయిడ్‌లో  ఆరు ఫీచర్లు

డార్క్‌మోడ్‌లో గూగుల్‌ మ్యాప్‌లు

దాదాపుగా అన్ని మేజర్‌ యాప్‌ల్లోనూ డార్క్‌మోడ్‌ ఉంది. ఇప్పుడు అది గూగుల్‌ మ్యాప్‌లకూ వర్తించనుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి థీమ్‌ని ట్యాప్‌ చేయాలి. ‘ఆల్వేస్‌ ఇన్‌ డార్క్‌ థీమ్‌’ని డార్క్‌ మోడ్‌కి టర్న్‌ చేసుకోవాలి. 


ఇంకొన్ని ఫీచర్లు

ఇబ్బడిముబ్బడిగా మరికొన్ని ఫీచర్లను కూడా పరిచయం చేస్తోంది. కస్టమ్‌ వాల్‌ పేపర్లు, వాయిస్‌ యాక్టివేటెడ్‌ గేమ్స్‌ - ఆండ్రాయిడ్‌ ఆటోలో లభిస్తాయి. ఆండ్రాయిడ్‌ ఆటో స్ర్కీన్‌పై న్యూ షార్ట్‌ కట్స్‌ ఉంటాయి. రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్‌ 6, ఆపై ఫోన్లలో ఈ ఫీచర్‌ కనిపించనుంది.


షెడ్యూలింగ్‌ టెక్స్ట్‌ మెసేజెస్‌

షెడ్యూలింగ్‌ ప్రకారం మెసేజ్‌లను పంపుకొనే సౌలభ్యం ఇప్పటికే జీమెయిల్‌లో ఉంది. ఇప్పుడు అది ఆండ్రాయిడ్‌లో లభ్యం కానుంది. అనువుగా ఉన్న సమయంలో మెసేజ్‌ని టైప్‌ చేసుకుని, కరెక్ట్‌గా షెడ్యూల్‌ ప్రకారం పంపుకోవచ్చు.  ఆండ్రాయిడ్‌ 7 అలాగే తదుపరి వెర్షన్లలో ఇది అందుబాటులో ఉండనుంది. ఉదాహరణకు రాత్రి పన్నెండు గంటలకు ఎవరికైనా బర్త్‌డే విషెస్‌ చెప్పాలనుకుంటే వాటిని ముందే టైప్‌ చేసి సరిగ్గా పన్నెండు గంటలకు వారికి చేరేలా చేయవచ్చు. 


అంధులకు టాక్‌బాక్‌

అంధులు, కంటిచూపు పాక్షిక ఇబ్బంది ఉన్న  వ్యక్తుల కోసం ఉద్దేశించిన టాక్‌బాక్‌ న్యూవర్షన్‌, అండ్రాయిడ్‌ స్ర్కీన్‌రీడర్‌ అందుబాటులోకి రానుంది. ఇది న్యూ రీడింగ్‌ మెనూ అన్న మాట. స్ర్కీన్‌ వైపు చూడకుండానే యాక్సెస్‌ పొందవచ్చు.’



మరింత స్మార్ట్‌గా గూగుల్‌ అసిస్టెంట్‌

హ్యాండ్స్‌ ఫీ అనుభవంతో పూర్తిగా రీఫైన్‌ చేసిన గూగుల్‌ అసిస్టెంట్‌ ఇది. ఫోన్‌ లాక్‌ చేసి ఉన్నప్పటికీ, వచ్చిన నోటిఫికేషన్లు అన్నింటినీ ఒక్క గ్లాన్స్‌ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. 


పాస్‌వర్డ్‌ సేఫ్‌

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలోకి పాస్‌వర్డ్‌ చెకప్‌ ఫీచర్‌ని గూగుల్‌ పరిచయం చేస్తోంది. ఇంతకుమునుపు వాడిన పాస్‌వర్డ్‌ను చూపిస్తుంది. ఎలా పెట్టుకోవచ్చో సలహా కూడా ఇస్తుంది. ఆండ్రాయిడ్‌ 9 తదుపరి వచ్చిన ఫోన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.

Updated Date - 2021-02-27T09:27:47+05:30 IST