కల్యాణ వెంకన్న ఆలయంలో ఆరడుగుల నాగుపాము

ABN , First Publish Date - 2021-05-18T06:54:41+05:30 IST

చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆరు అడుగుల నాగుపాము సోమవారం ఉదయం హల్‌చల్‌ చేసింది.

కల్యాణ వెంకన్న ఆలయంలో ఆరడుగుల నాగుపాము

చంద్రగిరి, మే 17: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆరు అడుగుల నాగుపాము సోమవారం ఉదయం హల్‌చల్‌ చేసింది. ఆలయ గోపురం మీదకు ఈ పాము ఎక్కే క్రమంలో కిందపడిపోయింది. ఆలయ సిబ్బంది సమాచారంతో స్నేక్‌ క్యాచర్‌ భాస్కర్‌నాయుడు ఆలయానికి చేరుకుని నాగుపామును పట్టుకున్నారు. జూపార్క్‌ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కొవిడ్‌ కారణంగా ఆలయంలో స్వామివారి దర్శనాన్ని రద్దు చేసి, కైంకర్యాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. లేదంటే భక్తుల మధ్య పాము పడిఉంటే భయాందళనతో పరుగులు తీసే పరిస్థితి ఏర్పడేది. 

Updated Date - 2021-05-18T06:54:41+05:30 IST