న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన ఆరుగురు పాక్ ఆటగాళ్లకు కరోనా

ABN , First Publish Date - 2020-11-26T21:35:29+05:30 IST

మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాళ్లలో ఆరుగురు కరోనా వైరస్ బారినపడ్డారు. మహమ్మారిని సమూలంగా

న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన ఆరుగురు పాక్ ఆటగాళ్లకు కరోనా

క్వీన్స్‌టౌన్: మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాళ్లలో ఆరుగురు కరోనా వైరస్ బారినపడ్డారు. మహమ్మారిని సమూలంగా నిర్మూలించిన న్యూజిలాండ్‌లో పాక్ ఆటగాళ్లు కరోనా బారినపడడం కలకలం రేపింది. బాధితులు ఆరుగురిని కఠిన క్వారంటైన్‌కు తరలించినట్టు కవీస్ బోర్డు తెలిపింది. ఆటగాళ్లు లాహోర్‌లో బయలుదేరినప్పుడు 53 మంది సభ్యుల బృందం వారిని పరీక్షించిందని, ఈ నెల 24న క్రైస్ట్‌చర్చ్ చేరుకున్న తర్వాత కూడా వారిని పరీక్షించినట్టు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని కనీసం మరో నాలుగు సార్లు పరీక్షించనున్నట్టు పేర్కొంది. ఆటగాళ్లు మొత్తం వారి గదులకే పరిమితమై ఉండనున్నట్టు తెలిపింది.


గదుల్లో ఉన్న చాలామంది ఆటగాళ్లు ఐసోలేషన్ నిబంధనలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలిందని, వారికి ఫైనల్ వార్నింగ్ ఇస్తామని హెచ్చరించింది. పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ రావడం సంతోషకరమే అయినా, వచ్చినవారు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఆరోగ్య అధికారి ఆష్లీ బ్లూమ్‌ఫీల్ డ్ పేర్కొన్నారు.  


Updated Date - 2020-11-26T21:35:29+05:30 IST