Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరేళ్ల భారతీయ బాలికకు బ్రిటన్ ప్రధాని అవార్డ్!

లండన్: ఆరేళ్ల భారతీయ బాలిక ఎలీషా గాధియా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 'డైలీ పాయింట్స్ ఆఫ్ లైట్' అవార్డు అందుకుంది. ఇంత చిన్న వయసులో అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు సమస్యలపై అవగాహన కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎలీషాకు ఈ అవార్డు లభించింది. వాతావరణ ప్రేమికురాలైన ఆమె యూకేలోని 'కూల్ ఎర్త్' అనే ఎన్‌జీఓకు మినీ అంబాసిడర్ కూడా. తన ప్రచారం ద్వారా ఎలీషా ఈ ఎన్‌జీఓ కోసం ఇప్పటివరకు ఏకంగా 3000 పౌండ్ల విరాళాలు సేకరించింది. అలాగే ఎలీషా తాను చదివే పాఠశాలలో వాతావరణ మార్పు సమస్యలపై అవగాహనలో భాగంగా ప్రత్యేకంగా ఓ క్లబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్లబ్‌లోని పిల్లలు, వారి తల్లిదండ్రులు వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, చెట్లను నాటాలని ప్రచారం నిర్వహిస్తుంటారు.

ఇక ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం పట్ల ఎలీషా ఆనందం వ్యక్తం చేసింది. ప్రధాని బోరిస్ జాన్సన్ దీని కోసం తనను ఎంచుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. అలాగే ప్రధాని తనకు ఓ లేఖ కూడా రాయడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా ప్రధానికి ఎలీషా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. తనకు ఈ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement