నాసిక్‌లో చిరుతపులి పట్టివేత...

ABN , First Publish Date - 2020-07-14T12:21:10+05:30 IST

నాసిక్ ప్రాంతంలో సంచరిస్తూ పలువురిపై దాడి చేసిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు....

నాసిక్‌లో చిరుతపులి పట్టివేత...

బోరివలి జాతీయ పార్కుకు తరలింపు

నాసిక్ (మహారాష్ట్ర): నాసిక్ ప్రాంతంలో సంచరిస్తూ పలువురిపై దాడి చేసిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 11 రోజుల పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. నాసిక్ సమీపంలోని జఖోరి గ్రామం వద్ద ఐదేళ్ల వయసు గల ఆడ చిరుతపులిని పట్టుకున్నారు. జూన్ 16 వతేదీన బభాలేశ్వర్ వద్ద నాలుగేళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసి చంపింది. చిరుతపులి గ్రామాల్లో సంచరిస్తూ పలువురిపై దాడి చేసిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు 17 బోన్లను ఏర్పాటు చేశారు. చిరుతపులి నుంచి శాంపిల్ సేకరించి పరీక్షకు పంపించారు. అనంతరం పట్టుకున్న చిరుతపులిని బోరివలిలోని జాతీయ వనానికి తరలించారు. 

Updated Date - 2020-07-14T12:21:10+05:30 IST