ఆరేళ్ల చిన్నారి రిపోర్టర్‌ అవతారమెత్తి..!

ABN , First Publish Date - 2022-01-23T07:07:01+05:30 IST

ఆరేళ్ల చిన్నారి రిపోర్టర్‌ అవతారమెత్తి తన ఇంటి సమీపంలో ఉన్న రోడ్డు పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. కశ్మీర్‌కు చెందిన ఆ చిన్నారి పెట్టిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది...

ఆరేళ్ల చిన్నారి రిపోర్టర్‌ అవతారమెత్తి..!

ఆరేళ్ల చిన్నారి రిపోర్టర్‌ అవతారమెత్తి తన ఇంటి సమీపంలో ఉన్న రోడ్డు పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. కశ్మీర్‌కు చెందిన ఆ చిన్నారి పెట్టిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఆ చిన్నారి తన పేరు మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆ వీడియోలో చేతిలో మైక్రోఫోన్‌ పట్టుకుని ఒక రిపోర్టరుగా రోడ్డు పరిస్థితిని వివరించింది. ఆ వీడియోలో రోడ్డు మొత్తం బురదమయంగా మారి కనిపించింది. కెమెరామెన్‌గా ఆ చిన్నారి తల్లి వ్యవహరించినట్టు ఆమె మాటల్లో అర్థమయింది. ఇలాంటి రోడ్డు ఉంటే ఇంటికి బంధువులు కూడా మా ఇంటికి రారని చెప్పుతూ, రోడ్డు పక్కన ఉన్న చెత్త, చెదారాన్ని కూడా వీడియోలో చూపించింది. రెండు నిమిషాలు మాత్రమే ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Updated Date - 2022-01-23T07:07:01+05:30 IST