ఎర్నాకులంను వణికిస్తున్న డెంగీ జ్వరాలు

ABN , First Publish Date - 2020-07-05T14:27:42+05:30 IST

కరోనా వైరస్‌తో కల్లోలంగా మారిన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి....

ఎర్నాకులంను వణికిస్తున్న డెంగీ జ్వరాలు

కొచ్చి (కేరళ): కరోనా వైరస్‌తో కల్లోలంగా మారిన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై 3వతేదీ వరకు ఎర్నాకుళం జిల్లాలో 1675 మందికి డెంగీ జ్వరాలు వచ్చాయి. ఒక్క జూన్ నెలలోనే 972 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎర్నాకుళంలో గత ఏడాది కూడా 158 డెంగీ కేసులు నమోదైనాయి. వర్షాకాలం ఆరంభంతో దోమలు వ్యాప్తి చెందడం వల్ల డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని డాక్టర్ పౌలోజ్ చెప్పారు. కొచ్చి కార్పోరేషన్ లో దోమల బెడద పెరిగింది. డెంగీ జ్వరాలతోపాటు మెదడు వాపు వ్యాధి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగీ జ్వరాలకు బ్రేకు వేసేందుకు దోమలను నివారించాలని అధికారులు నిర్ణయించారు. 

Updated Date - 2020-07-05T14:27:42+05:30 IST