పోలీసును చంపిన బందిపోటు దొంగ... 38 ఏళ్ల తర్వాత అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-11T12:45:49+05:30 IST

ఓ పోలీసును కాల్చి చంపిన బందిపోటు దొంగను 38 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేసిన ఘటన....

పోలీసును చంపిన బందిపోటు దొంగ... 38 ఏళ్ల తర్వాత అరెస్ట్

బార్మేర్ (రాజస్థాన్): ఓ పోలీసును కాల్చి చంపిన బందిపోటు దొంగను 38 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శక్తిదాస్ సింగ్ కరడుకట్టిన బందిపోటు దొంగ.1980వ సంవత్సరంలో దోపిడీలతో ప్రజలను గడగడలాడించిన శక్తిదాన్ సింగ్ పై అప్పట్లో పోలీసులు 40 కేసులు పెట్టారు. రాజస్థాన్ బందిపోటు దొంగ శక్తిదాన్ సింగ్ 1982వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని బణస్కంధ జిల్లాలో ఇక్బాల్ ఘడ్ ప్రాంతంలో ఓ పోలీసుతోపాటు మరో వ్యక్తిని కాల్చి చంపాడు. దీంతో తాము కేసు నమోదు చేసి శక్తిదాస్ సింగ్ కోసం గాలిస్తున్నామని, 38 ఏళ్ల తర్వాత శక్తిదాన్ సింగ్ ను 66 ఏళ్ల వయసులో బిజవాలా గ్రామంలో అరెస్టు చేశామని బార్మేర్ జిల్లా ఎస్పీ ఆనంద్ శర్మ చెప్పారు. చట్టం చేతులు చాలా పెద్దవి అన్నట్లు పోలీసును హతమార్చిన 38 ఏళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

Updated Date - 2020-07-11T12:45:49+05:30 IST