Bengaluru: 60మంది శ్రీచైతన్య కళాశాల బాలికలకు కరోనా

ABN , First Publish Date - 2021-09-29T14:03:02+05:30 IST

రెసిడెన్షియల్ కళాశాలలో 60 మంది బాలికలకు కరోనా పాజిటివ్ అని తేలిన...

Bengaluru: 60మంది శ్రీచైతన్య కళాశాల బాలికలకు కరోనా

బెంగళూరు (కర్ణాటక): రెసిడెన్షియల్ కళాశాలలో 60 మంది బాలికలకు కరోనా పాజిటివ్ అని తేలిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. బెంగళూరు నగరంలోని శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థినులకు కొవిడ్ పరీక్షలు చేయించగా 60 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జే మంజునాథ్ చెప్పారు. 60 మంది బాలికల్లో ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. లక్షణాలు లేని 58 మంది బాలికలను పాఠశాల హాస్టల్ లోనే క్వారంటైన్ చేశామని కళాశాల నిర్వాహకులు చెప్పారు.


 బళ్లారి నగరం నుంచి వచ్చిన ఓ విద్యార్థినిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కళాశాల హాస్టల్ లో ఉన్న 480 మంది బాలికలకు కరోనా పరీక్షలు చేశారు. కరోనా బారిన పడిన బాలికల్లో 46 మంది కర్ణాటక రాష్ట్రానికి చెందినవారున్నారు. తమిళనాడుకు చెందిన బాలికలు 14 మంది ఉన్నారని, వీరంతా ఇంటర్ మీడియెట్ చదువుతున్నారని అధికారులు చెప్పారు. కళాశాలలో ఉన్న 22 మంది అధ్యాపకులు, 57 మంది సిబ్బందికి కరోనా టీకాలు వేయించారు.


Updated Date - 2021-09-29T14:03:02+05:30 IST