Manipur:ఆ కుక్కను చంపినవాళ్లను పట్టిస్తే రూ.60 వేల రివార్డ్

ABN , First Publish Date - 2021-10-08T17:29:48+05:30 IST

పెంపుడు కుక్కను చంపిన వ్యక్తుల సమాచారం అందించినా, వారిని పట్టిచ్చిన వారికి రూ.60వేల రివార్డు ఇస్తామని...

Manipur:ఆ కుక్కను చంపినవాళ్లను పట్టిస్తే రూ.60 వేల రివార్డ్

మణిపూర్ డాగ్ లవర్స్ క్లబ్ సంచలన ప్రకటన

ఇంఫాల్ (మణిపూర్): పెంపుడు కుక్కను చంపిన వ్యక్తుల సమాచారం అందించినా, వారిని పట్టిచ్చిన వారికి రూ.60వేల రివార్డు ఇస్తామని మణిపూర్ డాగ్ లవర్స్ క్లబ్, యెనింగ్ యానిమల్ ఫౌండేషన్‌ సహా కుక్కల ప్రేమికులు ప్రకటించారు.దౌబాల్ జిల్లాలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మైంగ్ అనే పేరుగల పెంపుడు కుక్కను వాంగ్ జింగ్ లామ్డింగ్ చెరపురా వద్ద చంపి, దాని కళేబరాన్ని తీసుకువెళ్లారు. మైంగ్ అనే కుక్క లాంగ్ జామ్ ప్రాంత నివాసి ఆనందకుమార్ ది. తన పెంపుడు కుక్కను చంపిన వారిని శిక్షించి జంతు హింసను అరికట్టాలని కోరుతూ ప్రభుత్వానికి ఆనందకుమార్ తోపాటు జంతు ప్రేమికులు వినతిపత్రం సమర్పించారు. 


మణిపూర్ లో కుక్కలను మాంసం కోసం వధిస్తుండటంతో వీధికుక్కలు, పెంపుడు కుక్కలను చంపడాన్ని నిషేధిస్తూ మేఘాలయ జంతుసంరక్షణ పశువైద్యవిభాగం గత నెల 9వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కుక్కలను చంపడం జంతు హింస నిరోధక చట్టం 1960 సెక్షన్ 11, ఐపీసీ సెక్షన్ 428, 429ల ప్రకారం ఉల్లంఘన కింద కేసు పెట్టవచ్చు.మేఘాలయలో కుక్కలను మాంసం కోసం వధించే వారికి చట్టప్రకారం శిక్ష విధించనున్నారు. మేఘాలయ రాష్ట్రంలో వీధికుక్కలు లేదా పెంపుడు కుక్కలను చంపడం, మాంసం కోసం కుక్కలను వధించడం నిషేధించామని మేఘాలయ ప్రభుత్వం ట్వీట్‌ చేసింది.

Updated Date - 2021-10-08T17:29:48+05:30 IST