Haiti గ్యాస్ ట్యాంకర్ పేలుడులో 62 మంది సజీవ దహనం

ABN , First Publish Date - 2021-12-15T14:58:54+05:30 IST

హైతీ దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది.

Haiti గ్యాస్ ట్యాంకర్ పేలుడులో 62 మంది సజీవ దహనం

పోర్ట్-ఔ-ప్రిన్స్ (హైతీ): హైతీ దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలిన దుర్ఘటనలో 62 మంది సజీవ దహనమయ్యారు.మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాప్‌-హైతియన్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. కాలిపోయిన శిథిలాల మధ్య మృతదేహాల కోసం వెతుకుతున్నామని డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ చెప్పారు.ఇప్పటికే 62 మంది మృతదేహాలు వెలికితీశామని పాట్రిక్ పేర్కొన్నారు.కాలిపోయిన శిధిలాల మధ్య అధికారులు ఇంకా బాధితుల కోసం వెతుకుతున్నామని ఆయన చెప్పారు.ఈ దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడటంతో అదనపు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో కలిసి తాను సంఘటనా స్థలానికి వెళుతున్నట్లు ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ చెప్పారు. 


మోటారుసైకిల్ టాక్సీని తప్పించేందుకు డ్రైవరు అదుపు తప్పి ట్రక్కు పల్టీలు కొట్టినట్లు ప్రధాని చెప్పారు. అల్మోనోర్ ప్రాంతంలోని దాదాపు 40 ఇళ్లు కూడా దహనమయ్యాయని, అయితే ఇళ్లలోని బాధితుల సంఖ్యపై ఇంకా వివరాలు అందుబాటులో లేవని చెప్పారు.క్షతగాత్రులను సమీపంలోని జస్టినియన్ యూనివర్శిటీ ఆసుపత్రి తరలించారు. ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినపుడు మంటలు అంటుకుని ట్యాంకర్‌ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

Updated Date - 2021-12-15T14:58:54+05:30 IST