Abn logo
Sep 19 2021 @ 02:53AM

బాలికపై హత్యాచారం కేసు.. చంపేసి.. బొంతలో చుట్టేశాడు..!

శవాన్ని మాయం చేసేందుకు పక్కా ప్లాన్‌.. కాలనీలో జనాల అలజడితో వెనక్కి తగ్గిన రాజు

పిల్లలు పుట్టొద్దని భార్య కడుపులో తన్నేవాడు

గర్భవతి అయితే.. అబార్షన్‌ చేయించేవాడు

రేపిస్టు రాజు కేసులో.. విస్తుపోయే నిజాలు


హైదరాబాద్‌ సిటీ, సైదాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హ త్యాచారానికి పాల్పడ్డ రాజు గురించి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 9న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చే సిన రాజు.. ఆ బాలిక శవాన్ని చుట్టేసి మాయం చేసేందుకు ప్లాన్‌ చేశా డు. ఆ తర్వాత బయట పరిస్థితిని తెలుసుకునేందుకు నాలుగు గంటల పాటు అక్కడే తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా కాలనీలోకి రాగానే.. అంతా రాజుపైనే అనుమానం వ్యక్తం చేశా రు. అతడి ఇంటి తాళం పగులగొట్టి చూడాలని స్థానికులు కోరగా.. పోలీసులు నిరాకరించారు. అర్ధరాత్రి 12 దాటినా.. రాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం బలపడింది. అప్పుడు పోలీసులు తాళం పగులగొట్టి, ఇంట్లోకి వెళ్లి చూశారు. ఆ బాలిక మృతదేహం ఓ బట్టలో చుట్టి ఉండడాన్ని గుర్తించారు.


ఆ నాలుగు గంటలు ఎక్కడికెళ్లాడు?

బాలికను చంపాక.. శవాన్ని ఓ బొంతలో చుట్టి, ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు.. తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడని తెలిసింది. వారికి విషయం చెప్పకుండా నాలుగు గంటల పాటు అక్కడే గడిపాడు. అర్ధరాత్రి దాటాక ఇంటికి తిరిగి వచ్చి, బాలిక శవాన్ని మాయం చేయాలనేది అతడి ప్లాన్‌. ఇంటికి కొంత దూరంలో ఉండగానే.. పోలీసుల అలజడి, కాలనీ వాసులు రాజు ఇంటి వద్ద గుమికూడడం చూసి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత మాదన్నపేటలో ఉండే ఓ మేస్త్రీ వద్దకు వెళ్లాడు. అత్యవసరంగా డబ్బు కావాలంటూ రూ. 1,800 అడిగి తీసుకున్నాడు. అక్కడి నుంచి సంతో్‌షనగర్‌ వరకు నడిచి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎల్‌బీనగర్‌ మీదుగా ఉప్ప ల్‌ చేరుకున్నాడు. ఆ తర్వాత రాజు ఎటువెళ్లాడనేది తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. రాజు దర్జాగా తప్పించుకోవడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 


పిల్లలంటే ఇష్టం లేక.. భార్యపై దాడి

మౌనిక తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా.. ఆమె రాజును గుడిలో పెళ్లి చేసుకుంది. అయితే.. పిల్లలంటే ఇష్టం లేని రాజు.. తరచూ మౌనిక కడుపు లో తన్ని, చిత్రహింసలు పెట్టేవాడని ఆమె తండ్రి వెంకయ్య పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఆమె గర్భం దాలిస్తే అబార్షన్‌ చేయించేవాడని..  ఎనిమిదేళ్ల తర్వాత ఒక అమ్మాయి పుట్టిందని వివరించినట్లు సమాచారం. 


పరామర్శించనున్న కేటీఆర్‌ 

బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్‌ త్వరలో పరామర్శించనున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు చంచల్‌గూడలో కేటాయించనున్న డబుల్‌ బెడ్‌ రూం ఇంటి పత్రాలు, ట్యాక్సీ కారు తాళాలు అందజేస్తారని తెలిసింది.


సింగరేణి గుడిసెవాసులకు అండగా ఉంటా: ప్రవీణ్‌ 

సింగరేణి గుడిసెవాసులకు అండగా ఉంటానని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు.