పొలంలో గడ్డి కోస్తున్న మహిళకు కనిపించిన అస్థిపంజరం.. 4 నెలల తర్వాత బయటపడ్డ 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ మిస్టరీ..!

ABN , First Publish Date - 2022-01-25T21:07:38+05:30 IST

ఆ మహిళ గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది.. గడ్డి కోస్తుండగా ఆమెకు ఓ అస్థిపంజరం కనిపించింది..

పొలంలో గడ్డి కోస్తున్న మహిళకు కనిపించిన అస్థిపంజరం.. 4 నెలల తర్వాత బయటపడ్డ 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ మిస్టరీ..!

ఆ మహిళ గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది.. గడ్డి కోస్తుండగా ఆమెకు ఓ అస్థిపంజరం కనిపించింది.. వెంటనే దాని గురించి ఆమె పోలీసులకు సమాచారం అందించింది.. డీఎన్‌ఏ టెస్ట్ చేయించిన పోలీసులు ఆ అస్థిపంజరం నాలుగు నెలల క్రితం కనిపించకుండా పోయిన 13 ఏళ్ల బాలుడు కిషోర్‌దిగా తేల్చారు.. కిషోర్‌ను ఎవరో హత్య చేసి దహనం చేశారని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగిస్తున్నారు. 


రాజస్థాన్‌లోని అల్వార్‌కు సమీపంలో నివసిస్తున్న రామ్ వికాస్ అనే వ్యక్తి ఇంటికి సమీపంలో ఎప్పట్నుంచో అక్రమంగా క్వారీ పేలుళ్లు జరుగుతున్నాయి. కొండలను బ్లాస్ట్ చేసి రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. ఆ మాఫియాకు వ్యతిరేకంగా రామ్‌వికాస్ అధికారులకు, రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేశాడు. అందువల్ల రామ్ వికాస్ మీద అక్కసు పెంచుకున్న మాఫియా సభ్యులు అతడి కొడుకు కిషోర్‌ను చంపేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. 


కిషోర్‌ను చంపేసి కొండల్లోనే దహనం చేసి ఉంటారని, అక్కడకు గడ్డి కోసుకోవడానికి వెళ్లిన మహిళకు అస్థిపంజరం దొరికిందని పోలీసులు భావిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని మంత్రి శకుంతలా రావత్ ఆదేశించడంతో పోలీసులు మరింత శ్రద్ధగా దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ఆ బాలుడి కనిపించకుండా పోయిన దగ్గర్నుంచి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతూనే ఉన్నారు. గ్రామంలోని బావులన్నింటిలోనూ నీటిని తోడించి గాలించారు. కొండల్లో వెతికారు. చివరకు అస్థిపంజరంగా దొరకడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2022-01-25T21:07:38+05:30 IST