తెలుగు అకాడమీలో మరో భారీ స్కాంకు స్కెచ్‌

ABN , First Publish Date - 2022-01-22T22:50:27+05:30 IST

తెలుగు అకాడమీలో మరో భారీ స్కాంకు స్కెచ్‌

తెలుగు అకాడమీలో మరో భారీ స్కాంకు స్కెచ్‌

హైదరాబాద్: తెలుగు అకాడమీ కుంభకోణం కేసు నిందితుడు మరో భారీ స్కామ్‌కు స్కెచ్‌ వేశాడు. కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా షేక్ మస్తాన్‌వలీ సాహెబ్ ఉన్నాడు. తెలంగాణ గిడ్డంగుల శాఖకు చెందిన రూ.3.98 కోట్లు కాజేసేందుకు యత్నించాడు. మస్తాన్‌వలీపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రస్తుత యూబీఐ కార్వాన్ బ్రాంచి మేనేజర్ గిరీష్ కుమార్ తెలిపారు. గిడ్డంగుల శాఖ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు చెందిన ఫోర్జరీ పత్రాలను సృష్టించారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మస్తాన్‌వలీ తెలుగు అకాడమీ స్కామ్‌లో రెండు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. తాజా కేసులో మస్తాన్‌వలీని పోలీసులు విచారించనున్నారు.

Updated Date - 2022-01-22T22:50:27+05:30 IST