మాజీ సీఎం, ఆర్థిక మంత్రి పాత్ర ఏంటి..?. ఎస్‌డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు

ABN , First Publish Date - 2021-12-21T00:10:14+05:30 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రేమ్‌చంద్రారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిధులు విడుదల చేసిన వారికి...

మాజీ సీఎం, ఆర్థిక మంత్రి పాత్ర ఏంటి..?. ఎస్‌డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రేమ్‌చంద్రారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిధులు విడుదల చేసిన వారికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రేమ్‌చంద్రారెడ్డికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ దర్యాప్తు అధికారి నోటీసులు జారీ చేశారు. సీర్‌పీసీలోని సెక్షన్‌ 91, 160 కింద నోటీసులు జారీ చేసి సీఐడీ చేతులు దులుపుకుంది. తమకు సమాచారం ఇవ్వాలని పలు ప్రశ్నలను సంధిస్తూ ఏడు పేజీలు నోటీసు ఇచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీలు నిధుల విడుదలలో వారి పాత్ర ఏమిటని సీఐడి అధికారులు ప్రశ్నించారు. ప్రేమ్‌చంద్రారెడ్డికి సాక్షిగా సీఐడి నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంట్లు ఉంటే తమకు అందచేయాలని ఆదేశించింది. మొత్తం 37 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీస్సులో సీఐడి అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-21T00:10:14+05:30 IST