యువతకు నైపుణ్య శిక్షణ

ABN , First Publish Date - 2021-05-06T09:34:53+05:30 IST

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) పథకానికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

యువతకు నైపుణ్య శిక్షణ

ఉపాధి కల్పిస్తాం: మంత్రి గౌతమ్‌ రెడ్డి


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) పథకానికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.  పరిశ్రమలు, ఎలక్ర్టానిక్స్‌, ఐటీ తదితర రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎల్‌ఐ పథకాలను ప్రకటించాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకుని ప్రారంభించే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను ప్రారంభిస్తామని వెల్లడించారు. రంగాల వారీగా శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమల అవసరాలు తీర్చడంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-05-06T09:34:53+05:30 IST