ప్రసారాల్లో మెలకువలు పాటించాలి

ABN , First Publish Date - 2022-01-21T04:35:23+05:30 IST

ప్రసా రాల్లో మెలకువలు పాటించాలని, శాం తిభద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని యూ ట్యూబ్‌ ఛానళ్ల ప్రతినిధులను ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు హెచ్చరించారు.

ప్రసారాల్లో మెలకువలు పాటించాలి
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాదరావు

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రతినిధులకు డీఎస్పీ హెచ్చరిక

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 20: ప్రసా రాల్లో మెలకువలు పాటించాలని, శాం తిభద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని యూ ట్యూబ్‌ ఛానళ్ల ప్రతినిధులను ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యర్థులపై చేస్తున్న అభియోగాలను ఎడిట్‌ చేయకుండా యధాతధంగా తమ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నారన్నారు.

దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, భౌతిక దాడులకు కూడా కారణమౌతున్నాయన్నారు. గతంలో ఒకసారి ఇదే విషయాన్ని తెలిపామని, కొందరు మారగా, ఇంకా కొందరు యధాతధంగా అభియోగాలను ప్రసారం చేస్తున్నారన్నారు. ఇకపై అలా ప్రసారం చేస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ప్రసారాలు వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టినా, సదరు గ్రూప్‌ ఆడ్మిన్‌పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, టుటౌన్‌ సీఐ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:35:23+05:30 IST