చర్మ కేన్సర్‌ను గుర్తించే ఏఐ

ABN , First Publish Date - 2020-04-02T07:05:32+05:30 IST

కృత్రిమ మేధ(ఏఐ)తో చర్మ కేన్సర్‌ను గుర్తించే సరికొత్త పరిజ్ఞానాన్ని దక్షిణకొరియాలోని సియోల్‌ నేషనల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. మారుమూల

చర్మ కేన్సర్‌ను గుర్తించే ఏఐ

సియోల్‌, ఏప్రిల్‌ 1 : కృత్రిమ మేధ(ఏఐ)తో చర్మ కేన్సర్‌ను గుర్తించే సరికొత్త పరిజ్ఞానాన్ని దక్షిణకొరియాలోని సియోల్‌ నేషనల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డెర్మటాలజిస్టులను వెతుక్కుంటూ వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అటువంటి వారి కోసమే ఈ ఏఐ టూల్‌ను అభివృద్ధిచేసినట్లు తెలిపారు. ఇందులోని అల్గారిథమ్‌లు 134 రకాల చర్మ సమస్యలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి, ప్రాథమిక చికిత్సా మార్గాలను రోగులకు సూచిస్తాయని వెల్లడించారు. 

Updated Date - 2020-04-02T07:05:32+05:30 IST