స్కిన్‌ ఫాస్టింగ్‌

ABN , First Publish Date - 2020-12-21T05:36:40+05:30 IST

కొంత కాలం పాటు చర్మానికి ఎటువంటి సౌందర్యసాధనాలు వాడకుండా ఉండడమే ‘స్కిన్‌ ఫాస్టింగ్‌’. గాజు లాంటి చర్మం గ్లాస్‌ స్కిన్‌ కోసం పది అంచెల కొరియా స్కిన్‌కేర్‌ ట్రెండ్‌ మొదలైన కొద్ది రోజులకే ఈ సరికొత్త స్కిన్‌ ఫాస్టింగ్‌ ట్రెండ్‌ ఊపందుకుంది...

స్కిన్‌ ఫాస్టింగ్‌

కొంత కాలం పాటు చర్మానికి ఎటువంటి సౌందర్యసాధనాలు వాడకుండా ఉండడమే ‘స్కిన్‌ ఫాస్టింగ్‌’. గాజు లాంటి చర్మం గ్లాస్‌ స్కిన్‌ కోసం పది అంచెల కొరియా స్కిన్‌కేర్‌ ట్రెండ్‌ మొదలైన కొద్ది రోజులకే ఈ సరికొత్త స్కిన్‌ ఫాస్టింగ్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. 


స్కిన్‌ ఫాస్టింగ్‌... జపాన్‌కు చెందిన మిరాయి క్లినిక్‌ అనే ఓ స్కిన్‌ కేర్‌ కంపెనీ నూతన సృష్టి. సంప్రదాయ ఉపవాసాలతో శరీరానికి ఆరోగ్యపరమైన లాభం చేకూరుతుందనే హిపొక్రటీస్‌ నమ్మకం స్ఫూర్తితో స్కిన్‌ ఫాస్టింగ్‌ ప్రక్రియ జపాన్‌లో రూపు దిద్దుకుంది. చర్మానికి ధారళంగా గాలి అందుతూ ఉండాలి. సౌందర్యసాధనాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఉంటే, సరిపడా గాలి అందక చర్మం పలు రకాల సమస్యలకు గురయ్యే వీలుంటుంది. కాబట్టి చర్మానికి ఎటువంటి క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు, మేకప్‌ అప్లై చేయకుండా వదిలేస్తే, చర్మంలో సహజసిద్ధ నూనెల ఉత్పత్తి జరిగి, తేమ అంది చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఒక నెలలో చర్మంలో జరిగే మార్పుల గురించి జపనీయులు అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనాల్లో స్కిన్‌ ఫాస్టింగ్‌ వల్ల చర్మంలోని విషకారకాలు, మలినాలు తొలగి, చర్మం పునరుత్తేజం పొందడం వారు గమనించారు.


వీరు మినహాయింపు: స్కిన్‌ ఫాస్టింగ్‌ అన్ని రకాల చర్మాలకూ సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. యాక్నె తలెత్తే తత్వం ఉన్న చర్మతత్వం కలిగినవాళ్లు, విపరీతమైన పొడిచర్మం కలిగినవాళ్లు, సున్నిత చర్మం కలిగినవాళ్లు స్కిన్‌ ఫాస్టింగ్‌కు దూరంగా ఉండడమే మేలంటున్నారు చర్మ నిపుణులు. వీరి చర్మానికి అదనపు సౌందర్య పోషణ అవసరం. లేదంటే వీరి చర్మం మరింత పొడిబారడం, మరిన్ని యాక్నె తలెత్తడం లాంటి సమస్యలకు గురవుతుంది. కాబట్టి చర్మ తత్వం ఆధారంగా చర్మ రక్షణ చర్యలు చేపట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా చర్మవైద్యుల సూచనను బట్టి అవసరమైన చర్మ సౌందర్య చికిత్సలు అనుసరించాలి. 

Updated Date - 2020-12-21T05:36:40+05:30 IST