గ్యాడ్జెట్‌తో చర్మ సమస్యలు?

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

కరోనాడేస్‌లోకి లాగిన్‌ అయ్యాక.. గత రెండేళ్లనుంచీ గ్యాడ్జెట్స్‌తో గడిపేవారి సంఖ్య మరీ ఎక్కువైంది. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారే కాదు......

గ్యాడ్జెట్‌తో చర్మ సమస్యలు?

కరోనాడేస్‌లోకి లాగిన్‌ అయ్యాక.. గత రెండేళ్లనుంచీ గ్యాడ్జెట్స్‌తో గడిపేవారి సంఖ్య మరీ ఎక్కువైంది. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారే కాదు.. టైం పాస్‌కి డిజిటల్‌ స్ర్కీన్స్‌తో అనుబంధం పెంచుకున్న వాళ్లెక్కువయ్యారు. దీనివల్ల నిద్రలేమితో పాటు చర్మసమస్యలూ తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 


టీవీ, కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌, స్మార్ట్‌ఫోన్‌.. నుంచి వచ్చే నీలి కిరణాలు కేవలం యువతమీదనే కాదు.. ఇంట్లో ఉండే పిల్లల మీద కూడా ప్రభావం చూపుతాయి. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ కాస్మొటిక్‌ సైన్స్‌’ వాళ్లు పరిశోధన ప్రకారం.. కేవలం నిద్రమీదనే కాకుండా చర్మకణాల మీద నీలి కిరణాలు ప్రభావం చూపిస్తాయని తేలింది. ‘ఈ రెండేళ్లనుంచీ బ్లూ లైట్‌తో గడుపుతోన్న వారెక్కువయ్యారు. బ్లూ రేస్‌ పడితే చర్మం ముడతలు పడుతుంది. హైపర్‌ పిగ్మెంటేషన్‌, కొల్లాజిన్‌ ఉత్పత్తి కాదు. దీనివల్ల చర్మం ఎర్రపడటం, ఇన్‌ఫ్లమేషన్‌’ కలుగుతుందని చర్మ వైద్యులు చెబుతున్నారు. ‘నీలి కిరణాలు వల్ల చర్మం మీద అధిక ప్రభావం పడుతుంది. పిగ్నెంటేడెట్‌ డాట్స్‌, అలర్జీలు‘ కలుగుతాయని డెర్మటాజిస్టులు చెబుతున్నారు. సెన్సిటివ్‌ స్కిన్‌ ఉండేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST