నరసన్నపేటలో జనతా కర్ఫ్యూ విజయవంతం

ABN , First Publish Date - 2020-09-28T11:30:54+05:30 IST

కరోనా ని యంత్రణలో భాగంగా ఆదివారం పట్టణ ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలు, వ్యాపారు సూచనల మేరకు మండల కొవిడ్‌ అధికారి ఆర్వీ రామన్‌ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుకాణదారులు షాపులను మూసివేశారు.

నరసన్నపేటలో జనతా కర్ఫ్యూ విజయవంతం

 స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపారులు, ప్రజలు 


నరసన్నపేట, సెప్టెంబరు 27:  కరోనా ని యంత్రణలో భాగంగా ఆదివారం పట్టణ ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలు, వ్యాపారు  సూచనల మేరకు మండల కొవిడ్‌ అధికారి ఆర్వీ రామన్‌ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుకాణదారులు షాపులను మూసివేశారు. ఉదయం 5 గంటల నుంచే పోలీసు లు ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు ఇళ్లుకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మూనుష్యంగా కనిపించాయి.


ఆదివారం ఉదయం కొందరు చికెన్‌, మటన్‌ దుకాణాలు తెరువగా  పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి వాటిని మూయించారు. పాత జాతీయ రహదారిపై ఎటువంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక వాహనాల్లో తిరుగుతూ పర్యవేక్షించారు.  కూరగాయాలు, చేపలు మా ర్కెట్‌, బజారువీధి, కళాశాల రోడ్డు, పాతబస్టాండ్‌, కొత్తబస్టాండ్‌లలో దుకాణాలు తెరవలేదు. పాలు, మెడికల్‌ షాపులు మా త్రం తెరిచారు.  జనసం చారం లేకపో వడంతో రోడ్లన్నీ బోసిపోయాయి.

 

 కరోనా కేసులిలా...

జలుమూరు: మండ లంలోని 8 గ్రామాల్లో ఆది వారం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దా రు పి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయా గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్‌గా గుర్తించి కొవిడ్‌ నిబంధనలు అమలు చేసినట్లు చెప్పారు. ప్రజలు కరోనా నియంత్రణకు నిబంధనలు పాటించాలని కోరారు.


 పాత పట్నం: మండలంలో గడిచిన 24 గంటల్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు నిర్థారణ అయ్యాయని ఇన్‌చార్జి తహసీల్దార్‌ కె.నాగభూషణరావు తెలిపారు. కాగా మండలంలో 18 మంది జ్వరపీడితులను గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే వివి ధ గ్రామాలకు చెందిన ముగ్గురిని ఉన్నత వైద్య సేవలు నిమిత్తం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలిం చామన్నారు. 

Updated Date - 2020-09-28T11:30:54+05:30 IST