అర్చకుల సమస్యలను పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-09-28T11:34:04+05:30 IST

అర్చకులు సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో అర్చకసంఘ నాయకులు వినతిపత్రం అందించారు.

అర్చకుల సమస్యలను పరిష్కరించండి

పలాస, సెప్టెంబరు 27: అర్చకులు సమస్యలు పరిష్కరించాలని మంత్రి  సీదిరి అప్పలరాజుకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో అర్చకసంఘ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు సైతం అర్చకుల సమస్యలు పరిష్క రించాలని, 1997లో పేస్కేల్‌ ప్రకారం వేతనాలివ్వాలని కోరినా ఏ ప్రభు త్వాలు పట్టించుకోలేదన్నారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర లో తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా అర్చక సంక్షేమ సంఘ నాయకుడు తారకేశ్వరరావు, బి.గణపతిరావు, తిరుమలరావు, దివాకర్‌, ఎస్‌.రవికుమార్‌ పాల్గొన్నారు.


‘రిజర్వేషన్‌ పేరుతో బ్రాహ్మణులకు మొండిచేయి’

పోలాకి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్‌ పేరుతో బ్రాహ్మణులకు మొండిచేయి చూపిస్తోందని పోలాకి గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు దార్లపూడి కృష్ణాజీ, ఆరవల్లి రామశర్మ,  శివరామకృష్ణ, తిలారు సంఘ నాయకులు జోస్యుల మురళి, శ్యామసుందర్‌ తదితరులు పేర్కొన్నారు. ఆదివారం సంఘ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల మహిళలకు అమలు చేసిన చేయూత పథకం బ్రాహ్మణులకు ఓసీ రిజర్వేషన్‌ పేరుతో వర్తింపజేయలేదన్నారు. జిల్లాలో సుమారు 10వేల మంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారున్నారని, వీరంతా ఎన్నికల్లో ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. తక్షణం బ్రాహ్మణులు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-28T11:34:04+05:30 IST