నిద్ర తగ్గితే కష్టమే!

ABN , First Publish Date - 2020-06-15T05:30:00+05:30 IST

రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ఎక్కువ కాలం కొనసాగితే పగటిపూట నిద్రమత్తు వదలదు...

నిద్ర తగ్గితే కష్టమే!

  1. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ఎక్కువ కాలం కొనసాగితే పగటిపూట నిద్రమత్తు వదలదు. 
  2. రోజూ 6 గంటలు నిద్రపోతున్నారా, 10 గంటలు నిద్రపోతున్నారా అనేది సమస్య కాదు. ఆలస్యంగా పడుకుంటే జీవ గడియారం దెబ్బతింటుంది కాబట్టి వేళకు నిద్రపోవాలి.


మంచి నిద్ర పట్టాలంటే..!

  1. కెఫిన్‌కు దూరం- సాయంత్రం 4 తరువాత టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌ తీసుకోవద్దు. 
  2. ఆహారం- మానసికంగా ఆరోగ్యంగా   ఉంటే పేగుల పనితీరు బాగుంటుంది. శుచిగా ఉండే ఆహారమే తినాలి. 
  3. దీర్ఘశ్వాస- పడుకునేముందు దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గి త్వరగా నిద్రపడుతుంది.
  4. చురుగ్గా ఉండండి- డ్యాన్స్‌, నడక, వ్యాయామం లాంటివి రోజూ 30 నిమిషాల పాటు చేయాలి. 
  5. ఫోన్‌కు దూరం - నిద్రకు రెండు గంటల ముందుగానే ఫోను పక్కన పెట్టేయాలి, సోషల్‌ మీడియాకు దూరం ఉండాలి.

Updated Date - 2020-06-15T05:30:00+05:30 IST