ఎగుమతుల్లో స్వల్ప క్షీణత

ABN , First Publish Date - 2021-03-03T06:27:34+05:30 IST

వరుసగా రెండు నెలల పాటు వృద్ధిని నమోదు చేసిన ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణత చవి చూసింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో ఎగుమతులు 0.25 శాతం క్షీణించి 2767 కోట్ల డాలర్లకు

ఎగుమతుల్లో స్వల్ప క్షీణత

న్యూఢిల్లీ : వరుసగా రెండు నెలల పాటు వృద్ధిని నమోదు చేసిన ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణత చవి చూసింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో ఎగుమతులు 0.25 శాతం క్షీణించి 2767 కోట్ల డాలర్లకు (రూ.2.08 లక్షల కోట్లు) తగ్గాయి. వాణిజ్య లోటు 1288 కోట్ల డాలర్లకు (రూ.96,600 కోట్లు) పెరిగింది. ఇదే నెలలో దిగుమతులు 6.98 శాతం పెరిగి 4055 కోట్ల డాలర్లుగా (రూ.3.04 లక్షల కోట్లు) నమోదయ్యాయి. 

Updated Date - 2021-03-03T06:27:34+05:30 IST