Abn logo
Sep 25 2021 @ 03:40AM

స్వల్పంగా పెరిగిన డీజిల్‌ ధర

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: డీజిల్‌ ధర శుక్రవారం లీటరుకు 20 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.88.82కు, ముంబైలో రూ.96.41కు చేరుకుంది. పెట్రోల్‌ ధర మాత్రం యథాతథంగా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.101.19, ముంబైలో రూ.107.26గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో పెరుగుదల నేపథ్యంలో చమురు విక్రయ కంపెనీలు డీజిల్‌ ధరను పెంచాయి. ఇక బ్యారెల్‌ బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 77.50 డాలర్ల స్థాయికి ఎగబాకింది.