ఆరంభం బెదిరింది... ముగింపు అదిరింది...

ABN , First Publish Date - 2021-06-14T22:01:31+05:30 IST

ఐటీ సెక్టార్ మినహా అన్ని రంగాల షేర్లూ ఉదయం నష్టాల్లో ట్రేడైనా.. ‘ముగింపు’లో మాత్రం నిఫ్టీ కేక పుట్టించింది. మధ్యాహ్నం సెషన్ తర్వాత ఊపందుకుని బేర్స్‌ను నష్టపరచింది.

ఆరంభం బెదిరింది... ముగింపు అదిరింది...

ముంబై : ఐటీ సెక్టార్ మినహా అన్ని రంగాల షేర్లూ ఉదయం  నష్టాల్లో ట్రేడైనా.. ‘ముగింపు’లో మాత్రం నిఫ్టీ కేక పుట్టించింది. మధ్యాహ్నం సెషన్ తర్వాత ఊపందుకుని బేర్స్‌ను నష్టపరచింది. ఈ క్రమంలో... నిఫ్టీకి మరో ఆల్‌టైమ్ రికార్డ్ లెవల్ క్లోజింగ్ దక్కినట్లైంది. ఇంట్రాడేలో 15823 పాయింట్లకు పెరిగి, ముగింపు మాత్రం 15811 పాయింట్ల వద్ద పలికింది.మొత్తంగా చూస్తే నిఫ్టీలో 250 పాయింట్ల బౌన్స్ కన్పించింది. ఇక... సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 52551 పాయింట్ల వద్ద ముగిసింది.


ఈ స్థాయిలో బుల్స్ చెలరేగడంతో బేర్స్ నీరసించిపోయారు. . మొత్తానికి... సాయంత్రానికి ఏ 150 పాయింట్ల నష్టమో తప్పదనిపించినా, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల మద్దతుతో సూచీలు లాభంతో ట్రేడింగ్‌ని ముగించగలిగాయి. ఈ రోజు ట్రేడింగ్ లో నిఫ్టీ 15,700 పాయింట్ల మార్క్‌ను మద్దతు స్థాయిగా తీసుకోగా, 15,800 పాయింట్లపైబడి ముగిసింది. 


ఇక టాప్ గెయినర్లలో టాటా మోటర్స్, రిలయన్స్ , విప్రో, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, 1.48-1.21శాతం లాభపడగా, వీటిలో టాటా మోటర్స్ ఉదయం నష్టాలనెదుర్కొని మళ్ళీ లాభాల్లోకి దూసుకురావడాన్ని విశ్లేషకులు ముందుగానే అంచనా వేయగలిగారు. రూ. 500 కోట్ల ఫండ్ రైజింగ్ ప్లాన్ వెనుక పెద్ద వ్యూహం ఉందనే అంచనాలే స్టాక్ జోరుకు కారణమని భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-14T22:01:31+05:30 IST