ముంపు తప్పదు

ABN , First Publish Date - 2021-06-18T04:49:30+05:30 IST

గోదావరికి వరదలు ఉధృతంగా వస్తే..

ముంపు తప్పదు
శిథిలావస్థలో నరసాపురంలోని ఐదు తూములు స్లూయిస్‌

భారీ వర్షాలు కురిస్తే డెల్టాకు వరద

శిథిలావస్థలో మూడు స్లూయిస్‌లు

90 కిలోమీటర్ల గట్టు పర్యవేక్షణకు నలుగురే లస్కర్లు


నరసాపురం, జూన్‌ 17:  గోదావరికి వరదలు ఉధృతంగా వస్తే.. డెల్టాకు పెనుముప్పు తప్పదు. రెండేళ్లుగా గోదా వరి పరీవాహక ప్రాంతాల్లోని ఏటిగట్ల పరి రక్షణకు ఒక్క రూపాయి వెచ్చించలేదు. శిథిలావస్థకు చేరినా స్లూయిస్‌లను గాలికి వదిలేశారు. మరోవైపు గత ఏడాది ప్రభుత్వం వరద ముం పును నివారించేందుకు నియమిం చిన టెక్నికల్‌ అడ్వైజరీ సిఫార్సు లను పట్టించుకోలేదు. ఏటిగట్టు పరి రక్షణకు గస్తీ నిర్వహించే లస్కర్లను ఇంతవరకు నియమించలేదు. 90 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతానికి రెగ్యులర్‌ లస్కర్లు నలుగురే ఉన్నారు. దీంతో గతేడాది మాదిరి వరదలు వస్తే ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజల్లో ఆందోళన మొదలైంది. విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు 90 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతం విస్తరించింది. గట్టు పరిరక్షణకు సిద్ధాంతం, నరసాపురంలో రెండు సబ్‌ డివి జన్లను ఏర్పాటుచేశారు. బ్రిటీష్‌ కాలం నాటి నిబంధనల ప్రకారం ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక లస్కర్‌ గట్టును పర్యవేక్షించాలి. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల స్థానాల్లో కొత్తవారిని నియమించడం లేదు. దీంతో నలు గురు మాత్రమే ఉన్నారు. గత ఏడాది తొమ్మిది మంది కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఈ ఏడాది  నియా మకాలు జరగలేదు. ఇప్పటికే గోదావరికి వరద తాకింది. దీంతో గట్టుపై ఈ నలుగురు లస్కర్లు, ఇద్దరు ఇంజనీర్లే పర్యవేక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. డెల్టాలో యలమంచిలి మండలం కాజ, వైవీ లంక, నరసాపురంలో ఐదు తూములు, ముస్కేపాలెం, దర్భరేవు, బియ్యపు తిప్ప స్లూయిస్‌లు ఉన్నాయి. వీటిలో ఐదు స్లూయిస్‌లు శిథిలావస్థకు చేరాయి. రెండేళ్ల నుంచి కనీసం మరమ్మతులు చేపట్టలేదు. దీంతో వరద వస్తే నీళ్లన్ని గ్రామాలను ముంచేస్తున్నాయి. గత ఏడాది వరదలకు వేలాది ఎకరాలు నీట మునగడానికి ఈ స్లూయిస్‌ కారణం. కనీసం వీటిని మరమ్మతులు చేసి ఉంటే కొద్దిగానైనా ముంపు నివారణ అయి ఉండేది. 1986 వర దలను పరిగణనలోకి తీసుకుని 2007లో ఏటిగట్ల ఎత్తును పెంచింది. దొంగ రావిపాలెం, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, లక్ష్మిపాలెం, చించినాడ, ముస్కే పాలెం, రాజుల్లంక వద్ద గట్టు ఎత్తు పనులు పెండింగ్‌ పడ్డాయి. మూడు కిలోమీటర్ల మేర ఈ గట్టును ఎత్తు చేయాలి. భూసేకరణ పనుల వల్ల అప్పట్లో ఈ పనులు ముందుకు సాగలేదు. ఉధృతంగా వరదలు వచ్చినప్పుడల్లా ఇక్కడ గట్టు కోతకు గురవుతుందన్న భయం వెంటాడుతోంది.


సిఫార్సులు బుట్టదాఖలు

గత ఏడాది వరద ఉధృతిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నేతృత్వంలో ఒక టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీని నియమించింది. ఈ బృందం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించి గోదావరి పరీవాహక ప్రాంత పటిష్ఠతకు కొన్ని సిఫార్సులు చేసింది. పెండింగ్‌లో వున్న ఏటిగట్టు ఎత్తు పనులు, స్లూయిస్‌లు, కొత్తగా కొన్నిచోట్ల గ్రోయిన్స్‌ ఏర్పాటు వంటి పనులు ఉన్నాయి. నివేదిక ఈ ఏడాది మార్చిలో సమర్పించినా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులేవి నోచుకోలేదు.




Updated Date - 2021-06-18T04:49:30+05:30 IST