30 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-12-03T04:41:24+05:30 IST

జిల్లా పోలీసులు 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్నారు.

30 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ కేకేఎన్‌ అన్భురాజన్‌

నిందితులలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు

నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు, 5 వాహనాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

కడప (క్రైం), డి సెంబరు 2: జిల్లా పోలీసులు 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్నారు. నిందితుల నుంచి 98 ఎర్రచందనం దుంగలను, ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు..

 రైల్వేకోడూరుకు చెందిన షేక్‌ మస్తాన్‌ ఆలియాస్‌బాబు(39) ప్రస్తుతం రాజంపేటలోని ఇసుకపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై రెండు మర్డరు కేసులు, హత్యాయత్నం కేసు, దొంగతనం కేసు ఉన్నాయి. ఇతను జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు నరికించి కర్ణాటక రాష్ట్రం కటికెనహళ్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఖలీల్‌ఖాన్‌, అఫ్రోజ్‌ఖాన్‌ సహకారంతో విదేశాలకు తరలించేవాడు. ఈ విషయం తెలిసి మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఖలీల్‌ఖాన్‌, అఫ్రోజ్‌ఖాన్‌లను అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఓఎస్డీ దేవప్రసాద్‌ ఆధ్వర్యంలో సిద్దవటం మండలం శనేశ్వరస్వామి దేవాలయం వద్ద, నందలూరులోని కన్యకాచెరువు సమీపంలో, పుల్లంపేట పరిధిలోని వత్తలూరు, రైల్వేకోడూరులోని గురప్పరాజుపల్లె, మైదుకూరు - బద్వేలు రోడ్డులో ఏకకాలంగా దాడులు నిర్వహించి మొత్తం 28 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు టన్నుల బరువున్న 98 ఎర్రచందన ం దుంగలను, లారీ, ఆటో, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓఎస్డీ దేవప్రసాద్‌, డీఎస్పీలు విజయకుమార్‌, భాస్కర్‌రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు.


నిందితులు వీరే..

కర్ణాటక రాష్ట్రం కటికెనహళ్లికి చెందిన షేక్‌ ఖలీల్‌ఖాన్‌ (32), అర్ఫజ్‌ఖాన్‌ ఆలియాస్‌ మున్నా(21), రాజంపేటలోని ఇసుకపల్లెకు చెందిన షేక్‌మస్తాన్‌ ఆలియాస్‌ బాబు(39), గాంఽధీనగర్‌కు చెందిన కలకట్ల గిరిచంద్ర(32), కొత్తబోయనపల్లెకు చెందిన ఊర్పు సురేష్‌ (29), రేణింతలకు చెందిన విజయకుమార్‌(32), కడప నానాపల్లెకు చెందిన పాయసం అశోక్‌కుమార్‌(24), ముద్దల శివయ్య (29), నందలూరు మండలం నల్లతిమ్మయ్యగారిపల్లెకు చెందిన రాజారెడ్డి(30) అరెస్టయ్యారు. పెండ్లిమర్రి మండలం వెంకటరామపురానికి చెందిన వెన్నపూస మల్లారెడ్డి(48), కడప పీఎస్‌ నగర్‌కు చెందిన కె.వెంకటశివకుమార్‌రెడ్డి(24), మోడమీదపల్లెకు చెందిన తప్పెట సురేంద్రనాధరెడ్డి(27), వరదకాలనీకి చెందిన దేవరకొండ శివప్రసాద్‌(27), శ్రీనగర్‌కు చెందిన దూదినేని రామ్మోహన్‌ (42) ఉన్నారు. అలాగే రాజంపేట మండలం గుండ్లూరు గ్రామం అరుంధతీవాడకు చెందిన అశోక్‌(24), రైల్వేకోడూరు మండలం అబ్బిరాజుగారిపల్లెకు చెందిన చెన్నంశెట్టినాయుడు (32), పొట్టిరాజుగారిపల్లెకు చెందిన పెనుగొండ గంగాధర్‌ (27), ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రమణ్యం ఆలియాస్‌ సుబ్బయ్య (35), జింకల గణేష్‌ (25), చెడమాల చెంచయ్య (30), వెంకటరెడ్డిపల్లెకు చెందిన రమేష్‌(20), ములపనూరుకు చెందిన కనుపర్తి నాగేశ్వర్‌ (40), ఓబన్నపల్లెకు చెందిన దేవరపల్లె శ్యాంసుందర్‌ (20- స్టూడెంట్‌), ఎస్‌.ఉప్పరపల్లెకు చెందిన గూడాల శంకరమ్మ (30), సూర్యనగర్‌కు చెందిన తెమ్మర్తిసుబ్బరాజు (50), బుడుగుంటపల్లెకు చెందిన సిగమాల వెంకటసుబ్బయ్య, ఖాజీపేట మండలం నూనెవారిపల్లెకు చెందిన భూమన సుబ్బారెడ్డి (27), మైదుకూరు మండలం జీవీసత్రంకు చెందిన ఇడగొట్టు నాగేంద్ర, పోరుమామిళ్ల మండలం సిద్దకిచ్చయ్యపల్లెకు చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్‌ (26) ఉన్నారు. కాగా పరారీలో ఉన్న వారిని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.

Updated Date - 2020-12-03T04:41:24+05:30 IST