జర్మనీలో కుప్పకూలిన విమానం.. పలువురి మృతి
ABN , First Publish Date - 2021-07-18T02:13:30+05:30 IST
జర్మనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొంత మంది ప్రయాణికులతో వెళ్తున్న చిన్న విమానం కుప్పకూలింది. స్టుట్గార్ట్ విమానాశ్రయం నుంచి శనివారం పొద్దున బయల్దేరిన పైపర్ ఎయిర్క్రాప్ట్కు చెందిన విమానం
బెర్లిన్: జర్మనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొంత మంది ప్రయాణికులతో వెళ్తున్న చిన్న విమానం కుప్పకూలింది. స్టుట్గార్ట్ విమానాశ్రయం నుంచి శనివారం పొద్దున బయల్దేరిన పైపర్ ఎయిర్క్రాప్ట్కు చెందిన విమానం ప్రమాదవశాత్తు స్టైనెన్బ్రాన్ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు. కాగా.. విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాకుండా ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం కూడా ఇంకా తెలియరాలేదు.