చిరు వ్యాపారులకు చేయూతనివ్వాలి

ABN , First Publish Date - 2020-09-25T06:16:41+05:30 IST

ఆత్మ నిర్బర్‌ పథకం ద్వారా జిల్లాలోని చిరువ్యాపారులకు రుణాలు అందజేసి చేయూతనివ్వాలని అదనపు కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, బ్యాంకర్లతో

చిరు వ్యాపారులకు చేయూతనివ్వాలి

పెండింగ్‌ యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలి

అదనపు కలెక్టర్‌ రాజర్షి షా


సంగారెడ్డి రూరల్‌, సెప్టెంబరు 24 : ఆత్మ నిర్బర్‌ పథకం ద్వారా జిల్లాలోని చిరువ్యాపారులకు రుణాలు అందజేసి చేయూతనివ్వాలని అదనపు కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరు వ్యాపారులకు అధికారులు, బ్యాంకర్లు అండగా నిలిచి అన్ని యూనిట్లను త్వరగా గ్రౌండింగ్‌ చేయాలన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు అత్మ నిర్బర్‌ పథకం కింద రూ.10 వేల సాయాన్ని అందిస్తున్నట్లు రాజర్షిషా తెలిపారు.


జిల్లాలో లక్ష్యం మేరకు వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. మున్సిపాలిటీల్లో (ఎస్‌హెచ్‌జీ) స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖల ద్వారా వివిధ ఆర్థిక మద్దతు పథకాలలో మంజూరైన పెండింగ్‌ యూనిట్లను త్వరగా గ్రౌండింగ్‌ చేయాలని చెప్పారు. రుణాలు తీసుకున్న లబ్ధిదారులు బకాయిలు సక్రమంగా చెల్లించాలని తెలిపారు. అనంతరం చిరు వ్యాపారులకు చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం రమణారెడ్డి, ఆర్డీవో నగే్‌షగౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T06:16:41+05:30 IST