స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమకు కష్టకాలం

ABN , First Publish Date - 2020-04-04T05:55:29+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ దెబ్బతో దేశీయ స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమ విలవిల్లాడుతోంది. మొబైల్‌ ఫోన్ల అ మ్మకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు అంటే మార్చి మధ్యకాలం వరకు మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు బాగానే

స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమకు కష్టకాలం

  • లాక్‌డౌన్‌తో రూ.15,000 కోట్ల నష్టం!
  • కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా


న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ దెబ్బతో దేశీయ స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమ విలవిల్లాడుతోంది. మొబైల్‌ ఫోన్ల అ మ్మకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు అంటే మార్చి మధ్యకాలం వరకు మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు బాగానే జరిగాయి. లాక్‌డౌన్‌ తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు జరగడం లేదు. ఏప్రిల్‌లోనూ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమ 200 కోట్ల డాలర్ల (రూ.15,000 కోట్లు) రాబడిని కోల్పోయే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది. గత ఏడాదిలో 15.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో మాత్రం అమ్మకాలు 3 శాతం తగ్గి 15.3 కోట్ల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా. మార్చిలో అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 27 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నామని, ఏప్రిల్‌ 14వరకు లాక్‌డౌన్‌ కొనసాగితే అమ్మకాలు దాదాపు 60 శాతం తగ్గే ఆస్కారం ఉందని, ఇదే కంపెనీలు తమ రాబడిని కోల్పోయేందుకు దారితీస్తోందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాతక్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కొనసాగితే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొత్త టెలికాం వినియోగదారుల సంఖ్య తగ్గిపోయింది. నెలవారీగా సగటున 15-30 లక్షల మంది కొత్త వారు చేరుతుంటే.. గత మార్చిలో మాత్రం ఈ సంఖ్య 5 లక్షలకు తగ్గిపోయింది.

Updated Date - 2020-04-04T05:55:29+05:30 IST