సొంత కెపాసిటీ ఎంత ఉన్నా... పవర్‌ ఉంటేనే సేఫ్‌!

ABN , First Publish Date - 2020-02-20T02:36:03+05:30 IST

కంగారు పడకండి. టైటిల్‌ చూసి ఇదేదో రాజకీయాలకి సంబంధించిన విషయం అనుకోకండి. మనం ఇక్కడ మాట్లాడేది పూర్తిగా టెక్నాలజీ విషయమే!

సొంత కెపాసిటీ ఎంత ఉన్నా... పవర్‌ ఉంటేనే సేఫ్‌!

కంగారు పడకండి. టైటిల్‌ చూసి ఇదేదో రాజకీయాలకి సంబంధించిన విషయం అనుకోకండి. మనం ఇక్కడ మాట్లాడేది పూర్తిగా టెక్నాలజీ విషయమే! స్మార్ట్‌ఫోన్ల సంగతే తీసుకోండి. బ్యాటరీల కెపాసిటీలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు 3000 మిల్లీ యాంపియర్‌ అవర్స్‌ ( mAH) మాత్రమే ఉంటే స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీలు ఇప్పుడు రెట్టింపు కెపాసిటీకి చేరాయి. మరి బ్యాటరీ కెపాసిటీలు ఇలా పెరుగుతూ పోతున్నప్పుడు - పవర్‌ బ్యాంక్‌ లకి డిమాండ్‌ తగ్గుతూ ఉండాలి - అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబాటు పడ్డట్టే! బ్యాటరీ కెపాసిటీలు ఎంత పెరుగుతున్నా... ఇప్పటికీ పవర్‌ బ్యాంక్‌ల ప్రభ ఏమాత్రం తగ్గలేదు. 10000maH, 20000maH, 30000maH... ఇలా వివిధ కెపాసిటీలు కలిగిన పవర్‌ బ్యాంకులకి రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతూనే వస్తోంది.


Mi, Sony లాంటి స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు మాత్రమే కాదు, Syska, Ambrane, KDM లాంటి ఎన్నెన్నో ఎలక్ట్రానిక్‌ కంపెనీలు - వివిధ కెపాసిటీలు కలిగిన పవర్‌ బ్యాంకుల్ని తయారుచేస్తున్నాయి. 10000 maH కెపాసిటీ కలిగిన పవర్‌ బ్యాంకులు సాధారణంగా 900 రూపాయలనుంచి 1200 రూపాయలవరకూ పలుకుతుండగా- తాజాగా Ambrane కేవలం 699 రూపాయలకే పవర్‌ బ్యాంక్‌ని అందిస్తోంది. నిత్యజీవితంలోని బ్యాంకింగ్‌, ఆఫీస్‌ పనులు మాత్రమే కాకుండా - వినోదం కూడా మొత్తం స్మార్ట్‌ఫోన్‌ తోనే ముడిపడిపోవడంతో - కేవలం ఫోన్‌ బ్యాటరీనే నమ్ముకునే పరిస్థితి లేదు. ఫోన్‌ బ్యాటరీ ఎంత కెపాసిటీ కలిగినప్పటికీ - పనుల హడావిడిలో దాన్ని ఛార్జ్‌ చేయడం మరిచిపోయే అవకాశం ఉంది. ఫోన్‌ ఆగితే జీవితమే ఆగిపోయే నేటి పరిస్థితుల్లో - అలాంటప్పుడు ఆదుకునేది పవర్‌ బ్యాంక్‌ మాత్రమే! అందుకే పవర్‌ బ్యాంకులకి అంత డిమాండ్‌!

Updated Date - 2020-02-20T02:36:03+05:30 IST