రూ.4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌.. అంబానీ నెక్ట్స్ టార్గెట్ ఇదే!

ABN , First Publish Date - 2020-09-23T06:57:37+05:30 IST

ఆన్‌లైన్‌ క్లాసులతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనలేక.. ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త..! త్వరలో రూ.

రూ.4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌.. అంబానీ నెక్ట్స్ టార్గెట్ ఇదే!

దేశీయంగా తయారు చేసేలా ప్రణాళిక


న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ క్లాసులతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనలేక.. ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త..! త్వరలో రూ. 4 వేలకే అన్ని ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రానుంది..!! భారత మొబైల్‌ఫోన్‌ రంగంలో మరింతగా దూసుకుపోయేలా ముఖేశ్‌ అంబానీ కొత్తగా ‘జియో స్మార్ట్‌ఫోన్‌’పై దృషి సారించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.


నిజానికి స్మార్ట్‌ఫోన్‌ కొనలేని పరిస్థితుల్లో ఉన్న 50 కోట్ల మంది అర చేతుల్లో ‘జియో స్మార్ట్‌ఫోన్‌’ ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, దేశీయ ఉత్పత్తి రంగం ఆ టార్గెట్‌ను అందుకోవడం సాధ్యం కాకపోవడంతో.. రెండేళ్ల కాలంలో 20 కోట్ల ఫోన్ల తయారీపై దృష్టిసారించారు.  అంబానీ తాజా నిర్ణయం దేశీయ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిదారులకు ఊతమిచ్చినట్లవుతుందని ఇండియన్‌ సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ అన్నారు.


గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 16.5 కోట్ల స్మార్ట్‌ ఫోన్లను ఉత్పత్తి చేసింది. బేసిక్‌ ఫోన్ల ఉత్పత్తి కూడా అదే స్థాయిలో జరిగింది’’ అని ఆయన చెప్పారు.  భారతీ ఎయిర్‌టెల్‌ కూడా సొంత బ్రాండ్‌తో 4జీ ఫోన్ల తయారీకి దేశీయ ఉత్పత్తిదారులను సంప్రదించిందని సమాచారం.


Updated Date - 2020-09-23T06:57:37+05:30 IST